Breaking News

Daily Archives: October 22, 2020

భారీగా నిషేదిత సిగరెట్లు, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ టౌన్‌ 1 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంజ్‌ ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం మరియు గోదాములో నిషేధిత సిగరెట్లు మరియు జర్ధాను నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్టు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్‌ ...

Read More »

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

భిక్కనూరు అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గురువారం పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ గాల్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ బైండ్ల సులోచన రాష్ట్ర ప్రభుత్వం అందజేసే స్కూల్‌ యూనిఫామ్‌లను, వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్‌, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌.కె. సుల్తానా, గ్రామ ఉపసర్పంచ్‌ సిద్దా గౌడ్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌ భూమయ్య, వార్డు సభ్యులు బాల్‌ నర్స్‌, పాఠశాల ఉపాధ్యాయులు రాధా లక్ష్మి, ...

Read More »

రసాయన శాస్త్రంలో డాక్టరేట్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో గురువారం పి. రమేష్‌ నాయక్‌కు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఎ. నాగరాజు పర్యవేక్షణలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ”సింథసిస్‌ ఆఫ్‌ నావెల్‌ హెటెరోసైక్లిక్‌ కాంపౌండ్స్‌ అండ్‌ స్టడీ ఆఫ్‌ థేర్‌ ఆంటిమైక్రోబియల్‌ ఆక్టివిటీస్‌” అనే అంశం పై చేసిన పిహెచ్‌. డి. పరిశోధానాంశానికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ నెల 10 వ తేదీన డిజిటల్‌ వేదిక ...

Read More »

దోస్త్‌ స్పెషల్‌ క్యాటగిరి ఎంపిక

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ ప్రక్రియ గురువారం ఆడిట్‌ సెల్‌ విభాగంలో నిర్వహించారు. ఇందులో స్పెషల్‌ క్యాటగిరికి ఎన్‌సిసిలో నలుగురు, సిఎపిలో ఒకరు హాజరయ్యారు. ఎన్‌సిసి, విద్యార్హతలు గల ధ్రువపత్రాల పరిశీలనా అధికారులుగా ఆచార్య. పి. కనకయ్య, డా. జి. బాలకిషన్‌, ఎన్‌సిసి ఆఫీసర్‌ అమెబ్కర్‌ బాబూరాం విచ్చేశారు.

Read More »

ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్‌ డే సందర్భంగా ) గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, ఐ.పీ.ఎస్‌. ఆదేశాల మేరకు 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని దాదాపు 735 మంది సద్వినియోగం చేసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, ...

Read More »

డిగ్రీలు, పిజిలు చదివారు.. ఇప్పుడేమయింది…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కారణంగా గత మార్చి నుండి పాఠశాలలు మూసివేయటంతో ప్రయివేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మూతికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు. అనంతరం రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దోమకొండ మండలానికి చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు పోతు కిషోర్‌ ఆత్మకు ...

Read More »

మహాధర్నా… పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద గురువారం నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర క్వింటాలుకు రూ. 1 వేయి 860 కల్పించాలని, సన్న రకం వడ్లు రూ. 2 వేల 500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా ...

Read More »

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’

బాన్సువాడ, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు జన్మదినం సందర్భంగా చేపట్టిన ”గిఫ్ట్‌ ఎ స్మైల్‌” కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కోసం బాన్సువాడ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అందించిన అంబులెన్స్‌ను గురువారం బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి అందజేశారు. బాన్సువాడ పట్టణంలోని స్పీకర్‌ నివాసం వద్ద అంబులెన్స్‌ను ఏరియా హాస్పిటల్‌ సిబ్బందికి ...

Read More »

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27 నుంచి ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ భానుమతి తెలిపారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి, ఏడు నుంచి 10వ తరగతి వరకు ఖాలీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వించనున్నట్లు పేర్కొన్నారు. 27న 6వ తరగతి, 28న 7, 8వ తరగతులు, 29న 9, 10వ తరగతుల వారికి పరీక్ష ఉంటుందన్నారు. ...

Read More »

నాయిని ఇక లేరు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాయిని నర్సింహ రెడ్డి 1944 మే 12 న జన్మించారు. తెలంగాణలో శాసన మండలి సభ్యులుగా పనిచేశారు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. అతను తెలంగాణ మొదటి హోం మంత్రి. జైళ్లు, అగ్నిమాపక సేవలు, సైనిక్‌ సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖలలో ఆయన అనేక సేవలు అందించారు. తెలంగాణాలో గవర్నర్‌ ప్రతిపాదించిన శాసన మండలి సభ్యుడు. నాయిని హైదరాబాదులోని ప్రముఖ నాయకులలో ఒకరు. తెలంగాణ కోసం ...

Read More »

చుక్కాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సుందరీకరణ

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామంలో ఆలయానికి దేవి నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ రోజున గ్రామంలో స్వామివారి రధోత్సవం జరగనుంది. ఊరేగింపును దష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం అందమైన రంగులు, విద్యుతన దీపాలతో సుందరీకరణపనులు పూర్తిచేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్‌.వెంకటనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సంతోషకుమార్‌, అర్చకులు పరంధామచార్యులు, ప్రధానార్చకులు శ్రీనివాస చార్యులు, నరసింహ చార్యులు, సంజీవాచార్యులు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, ...

Read More »