Breaking News

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’

బాన్సువాడ, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు జన్మదినం సందర్భంగా చేపట్టిన ”గిఫ్ట్‌ ఎ స్మైల్‌” కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కోసం బాన్సువాడ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అందించిన అంబులెన్స్‌ను గురువారం బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి అందజేశారు.

బాన్సువాడ పట్టణంలోని స్పీకర్‌ నివాసం వద్ద అంబులెన్స్‌ను ఏరియా హాస్పిటల్‌ సిబ్బందికి బాస్కర్‌రెడ్డి అందజేశారు. అన్ని వైద్య సౌకర్యాలు కలిగిన అధునాతన అంబులెన్స్‌ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మండల ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాలరెడ్డి, ఏఎంసి చైర్మన్‌ పాత బాల కష్ణ, మండల పార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, స్థానిక పాక్స్‌ చైర్మన్లు కష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, మండల నాయకులు దొడ్ల వెంకట రమ రెడ్డి, ఎజాజ్‌ ఖాన్‌, గురు వినయ్‌, గోపాలరెడ్డి, ఏలీముద్దీన్‌ బాబా, కౌన్సిలార్‌ నర్సగొండ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article