Breaking News

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27 నుంచి ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ భానుమతి తెలిపారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి, ఏడు నుంచి 10వ తరగతి వరకు ఖాలీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వించనున్నట్లు పేర్కొన్నారు.

27న 6వ తరగతి, 28న 7, 8వ తరగతులు, 29న 9, 10వ తరగతుల వారికి పరీక్ష ఉంటుందన్నారు. హాల్‌ టికెట్‌లు వెబ్‌సైట్‌లో అందుబటులో ఉన్నాయని విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Comment on the article