Breaking News

రహదారి పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి నెం.161 పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిట్లం, బిచుకుంద మండలాలకు చెందిన 12 గ్రామాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

హైవే రోడ్డు ఎత్తుగా ఉండటం వల్ల పక్కన ఉన్న 12 గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు తన దష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అటవీ, ట్రాన్స్‌కో, నేషనల్‌ హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి హైవే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, ఆర్‌టివో రాజా గౌడ్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ సోమయ్య, ట్రాన్స్‌కో ఈఈ శేషారావు, నేషనల్‌ హైవే, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు ధాన్యాన్ని లక్ష్యానికి అనుగుణంగా ...

Comment on the article