నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి కూనీపూర్ రాజారెడ్డి బుధవారం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ ఇన్చార్జి గ్రామం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ...
Read More »Daily Archives: October 28, 2020
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెరాస యువనాయకులు పోచారం సురెందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రాం రెడ్డి, సోమేశ్వరం సర్పంచ్ పద్మ మొగులయ్య, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసి చైర్మన్ పాత బాలకృష్ణ, బుడ్మి సొసైటీ చైర్మన్ ...
Read More »దళారులకు అమ్మి మోసపోవద్దు
కామరెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులకు తమ ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, కామారెడ్డి ఎంపిపి పిప్పిరి ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »పోలీసుల రక్తదానం
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినములు-2020లో భాగంగా బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనరేట్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని పోలీస్ కమీషనర్ కార్తికేయ ప్రారంభించి రక్తదానం చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
Read More »ఏ2, ఏ3 గేర్‌లో నడిపితే మంచి ధాన్యం వస్తుంది
డిచ్పల్లి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మెంట్రాజ్ పల్లి గ్రామ శివారులో వరి కోత పనులు చేస్తున్న హార్వెస్టర్‌ను, కోసి ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని వరి ధాన్యాన్ని 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, 247 రైస్ మిల్లర్లకు కేటాయింపు చేయడం జరిగిందని, వరి నాణ్యతా ...
Read More »