Breaking News

ఎన్నికల ప్రచారంలో రాజారెడ్డి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కూనీపూర్‌ రాజారెడ్డి బుధవారం పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మదన్‌ మోహన్‌ రావ్‌ ఇన్‌చార్జి గ్రామం రాయపోల్‌ మండలం తిమ్మక్‌ పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని, తెరాస ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు నిరుద్యోగ భతి, రుణమాఫీ, ఉద్యోగావకాశాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం వెళ్లదీస్తుందని వివరించారు.

కెసిఆర్‌ కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నారని, నీళ్ళు, నిధులు, నియామకాలను ప్రక్కన పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు సింగం వెంకటేష్‌, రాజేష్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article