కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. కామరెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చలికాలంలో, పండగల సందర్భంగా అధికంగా ఉండే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు.

కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని తన కుటుంబ సభ్యలందరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం వ్యక్తి-వ్యక్తి కి మద్య కనీసం 2 గజాల దూరం పాటించాలని, జనం గుంపులుగా చేరకూడదని, తరుచుగా చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. పిల్లలు, గర్భిణీలు, వద్దులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు వీధుల్లోకి రాకుండా ఉండాలని, పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులు సోకవని వివరించారు.

ప్రచారంలో డాక్టర్‌ సుజయత్‌ అలీ, డాక్టర్‌ హరీష్‌, వి.సంజీవరెడ్డి, డాక్టర్‌ రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు, కామారెడ్డిలో అశోక్‌ నగర్‌, ఎన్‌జివోస్‌ కాలనీ, కాకతీయ నగర్‌, విద్యానగర్‌, మున్సిపల్‌ రోడ్‌, నిజాంసాగర్‌ రోడ్‌, స్టేషన్‌ రోడ్‌, వివేకానంద కాలనీ, శ్రీరాంనగర్‌ కాలనీలో ప్రచారం చేసారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article