Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పలు అభివద్ది పనులకు శుక్రవారం శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు.

బీబీపేట్‌ మండలంలో 2.95 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని, జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో దాత తిమ్మన్నగారి సుభాష్‌ రెడ్డి స్వంత నిధులు సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థానలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శోభా, జిల్లా కలెక్టరు శరత్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రాసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article