ప్లాస్మాదానం.. ప్రాణదానం….

కామారెడ్డి, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కరోనా పేషెంట్‌కి బి పాజిటివ్‌ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన వ్యాపారి జలిగామ చంద్రశేఖర్‌ మానవత దక్పథంతో బి పాజిటివ్‌ ప్లాస్మాను సన్‌ షైన్‌ వైద్యశాల హైదరాబాదులో అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని బాలు అన్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో సకాలంలో ప్లాస్మా అందజేసి ప్రాణాలు కాపాడతామన్నారు. ఇప్పటికి 5 వేల మందికి సకాలంలో రక్తాన్ని మరియు 39 మందికి ప్లాస్మా అందించి ప్రాణాలను కాపాడడం జరిగిందని, కరోనా నుంచి తిరిగి కోలుకున్నవారు ప్లాస్మా దానము చేయడానికి ముందుకు రావాలని, కరోణ వ్యాధికి మందు లేదని ప్లాస్మా ఒకటే ప్రాణాలను కాపాడడానికి అవకాశం అన్నారు.

ఈ సందర్భంగా ప్లాస్మాదానానికి ముందుకు వచ్చిన దాతను అభినందించారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article