Breaking News

గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నవంబరు 1న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 48 వేల సీట్లకు 1.48 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను గురుకుల సొసైటీలు గుర్తించాయి.

విద్యార్థి సెట్‌ దరఖాస్తులో పేర్కొన్న చిరునామా మేరకు సంబంధిత మండలంలో కేంద్రం కేటాయించాయి. ఒక్కో తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండాలని, వారి మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలని గురుకుల సెట్‌ ప్రధాన కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కొత్తగా మరో 103 పరీక్ష కేంద్రాలను గుర్తించామని, రాష్ట్రవ్యాప్తంగా 433 కేంద్రాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.

తరగతి గదిని రసాయనాలతో శుద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులకు జలుబు, దగ్గు ఉండకూడదని, వారిని థర్మామీటర్‌తో పరీక్షించాక లోపలకు అనుమతించాలని తెలిపారు. బెంచీకి ఒకే విద్యార్థి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలన్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article