చలికాలంలో వ్యాప్తిచెందే వ్యాధులపై అవగాహన

కామారెడ్డి, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు చలికాలంలో వ్యాప్తి చెందే వ్యాధులకు తోడు ప్రస్తుతం కరోనాను నివారణ, నియంత్రణ గురించి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు, వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో పాటించాలని డిఎం హెచ్‌వో తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో అంటువ్యాధులు మరియు కోవిడ్‌ 19ను పూర్తిస్థాయిలోవ్యాప్తిని అరికట్టేందుకు విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. వైద్యుల సూచనలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోవిడ్‌ 19 నివారణకు మనదగ్గర 4 ముఖ్య సూత్రాలు 1. మాస్క్‌ ధరించడం 2 చేతులు తరచుగా సబ్బుతో గాని సానిటీజర్‌తో శుభ్రపరచాలి, 3. భౌతిక దూరం కనీసం అరుడుగులు పాటించడం, 4. జన సమూహములోకి వెళ్లరాదు. వీటిని తప్పక పాటించాలన్నారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, మార్కెట్‌, సివిల్‌సప్లయి గోడౌన్‌ వద్ద ప్రచారం నిర్వహిస్తూ మాస్క్‌ లేని వారికి జిల్లా వైద్యశాఖ మాస్కులు అందజేశారు.

కోవిడ్‌19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని తన కుటుంబ సభ్యులందరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రచారంలో వి.సంజీవరెడ్డి, రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు, కె.విఠల్‌రావు పాల్గొన్నారు. కామారెడ్డిలో కాకతీయ నగర్‌, విద్యుత్‌నగర్‌, నిజాంసాగర్‌ రోడ్‌, విద్యానగర్‌, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article