Breaking News

చెత్తను సంపద కేంద్రానికి తరలించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడవలసిన బాధ్యత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి పై ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకతి వనాల్లో నాటిన మొక్కలు వంద శాతం సంరక్షణ చేసే విధంగా చూడాలన్నారు. రోడ్‌ సైడ్‌ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు సంరక్షణ చేయాలని కోరారు.

కంపోస్టు షెడ్లను వినియోగించుకోవాలని సూచించారు. చెత్తను సంపద కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. స్మశాన వాటికలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్‌ వంద శాతం పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. మున్సిపల్‌ పరిధిలోని వీధి వ్యాపారులకు రుణాలను ఇప్పించాలని సూచించారు.

మొక్కలకు జియో ట్యాగింగ్‌ వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేందర్‌ రెడ్డి, ఏపీడీ సాయన్న, మెప్మా పిడి శ్రీధర్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article