Breaking News

ఘనంగా మహనీయుల జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం మహర్షి వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ మాట్లాడుతూ ఇద్దరు మహనీయుల జయంతి వేడుకలు ఒకే రోజు జరగడం గర్వంగా ఉందన్నారు.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారతదేశ తొలి ప్రధాని, 530 సంస్థానాలను దేశంలో విలీనం చేసి ఉక్కుమనిషిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article