నిర్మల్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా డిసెంబర్ 2న ఉదయం నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చినవారు జీతం బకాయిలు మరియు బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ...
Read More »Monthly Archives: November 2020
ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ధరణిలో ఇప్పటి వరకు 1585 స్లాట్ బుకింగ్ జరిగాయని, అందులో 1528 రిజిస్టర్ అయినవి, 57 మాత్రమే పెండింగ్ వున్నవని, అదేవిధంగా ప్రతి మండలంలో ధరణి కార్యాలయానికి 9 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పారు. కావున ప్రతి మండలంలో ఒక మంచి కార్యాలయంతో పాటు సదుపాయాలు ఇతర అవసరాలకు మంజూరు చేశారని పేర్కొన్నారు. దీనికి ...
Read More »అబలలు కాదు సబలలు
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతి చిన్న వయస్సులో మున్సిపల్ చైర్ పర్సన్‌గా పదవి పొందిన కుమారి నిట్టు జాహ్నవిని అతి పిన్న వయస్సులోనే ఎవరైస్టు శిఖరాన్ని అధిరోహించి భరత జాతి ఖ్యాతిని ఇనుమడించిన మాలోతు పూర్ణ అభినందించారు. స్థానిక సమన్య హోటల్లో మున్సిపల్ చైర్‌పర్సన్‌ను మాలోతు పూర్ణ కలిసి అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి మున్సిపాలిటీని అగ్రశ్రేణిగా తీర్చిదిద్దాలని ఆమె ఆకాక్షించారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చునని, ఆడవారు అబలలు కాదు సబలలు అని, అన్ని ...
Read More »సర్వేలో పారదర్శకత పాటించాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల భాగస్వామ్యంతో మిషన్ అంత్యోదయ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శనివారం జనహితలో డివిజనల్ పంచాయితీ అధికారులు, మండల పంచాయితీ అధికారులు, పంచాయితీ రాజ్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎపిఓ ఎపిడిలు, రిలయన్స్ స్వచ్చంద సంస్థ ప్రతినిథులకు నిర్వహించబడిన మిషన్ అంత్యోదయ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన పొందాలని, అనంతరం మండల స్థాయిలో గ్రామ ...
Read More »మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. శనివారం ఆయన టేక్రియల్ చౌరస్తా వద్ద హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటుచేసి, రక్షణ కంచె వేయాలని సూచించారు. మొక్కలు ఎండిపోకుండా మునిసిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పాత జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని కోరారు. మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన ...
Read More »పదవీ విరమణ
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి కార్యాలయములో పబ్లిసిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ప్రభుత్వ సర్వీసు నుండి శనివారం పదవీ విరమణ చేసిన వస్తాద్ గంగాధర్ గౌడ్‌ను జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు సన్మానించారు. కార్యక్రమంలో కార్యాలయ టైపిష్టు దేవుజి, పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంభీర్ మనోహర్ రావు, సునీత, కళాకారులు రమేశ్ రావు, మల్లిఖార్జున్, శ్రీనివాస్, పోశెట్టి పాల్గొన్నారు.
Read More »జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని, మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. అట్టడుగు ...
Read More »రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి, ఎంపీ లాడ్స్ పనులు పూర్తి కావాలి
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో ఎంపి లాడ్స్, రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పంచాయతీ రాజ్, శాఖ ఈఈ, డిఈ, ఏఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పనుల అభివద్ధి గురించి మండలాల వారీగా సమీక్షించారు. రైతు వేదికలు శనివారం వరకు పనులు పూర్తి ...
Read More »గిన్నిస్ రికార్డు గ్రహీతకు కలెక్టర్ ప్రశంసలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతి చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభా శ్రీ ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రశంసించారు. సుభాష్ నగర్ వాసులైన విజయ్ కుమార్, ప్రసన్నల కూతురు విభా శ్రీ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతు తన ఎల్‌కెజి, యూకేజీ చదువుతున్న రోజుల్లోనే ఆయా కళారంగాలలో అద్భుతమైన ప్రదర్శనలు చేసి ఆహుతులను అలరించింది. దీంతో ...
Read More »శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణ కొరకై పోలీస్ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ప్రజలు సద్భావన, జీవన విధానం ఆదర్శవంతమైనవని ఇటువంటి వాతావరణానికి భంగం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అల్లరిమూకల దుష్ప్రచారాలు, వదంతుల (రూమర్స్) పట్ల ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని, అదే విధంగా పోలీసు శాఖ సంఘ విద్రోహమూకపై గట్టి నిఘా ఉంచుతున్నామని, ...
Read More »పరీక్షలు వాయిదా – ఆన్లైన్ తరగతులు యధాతథం
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 1వ తేదీ నుండి నిర్వహించబడే బి.ఏ. బి.కాం, బి.వి. ఏ.బి.యస్సీ. 2వ, 4వ సెమిస్టరు (రెగ్యూలర్) (2019-20) మరియు 1వ, 2వ, 3వ సెమిస్టరు (బ్యాక్లాగ్) పరీక్షలను విద్యార్థుల అభ్యర్ధన మేరకు వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినారాయణ, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి వై.వేణుప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పైన తెలిపిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. 3వ సెమిస్టరు (రెగ్యులర్) ...
Read More »డిసెంబర్ 15 లోగా పూర్తిచేయండి
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కజొన్న కొనుగోళ్లను డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం జనహిత భవన్లో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులతో మొక్కజొన్న కొనుగోలుకు చేపట్టే చర్యలను ఆయన సమీక్షించారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా చేపట్టే కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా, బయట కొని కేంద్రాలలో అమ్మినా, లెక్కలలో తారుమారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ కొనుగోలు ...
Read More »సమస్యలుంటే చెప్పండి
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి ధాన్యం గోదామును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఎస్.ఎస్.నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేందాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అని అడిగారు. కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. అనంతరం బికనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో రైస్ మిల్లును సందర్శించి కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టరు డాక్టర్ ...
Read More »ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
ఎల్లారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము, దళిత సైన్యం, వివిధ గ్రామాల సర్పంచులు, తదితర నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటి దినం 26.నవంబర్ 1949 సంవత్సరంలో భారత రత్న డా.బి.ఆర్. అంబెడ్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించడం, పరిషత్ ఆమోదించడం జరిగిందన్నారు. ...
Read More »కామారెడ్డిలో సార్వత్రిక సమ్మె
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డి మునిసిపల్ కార్యాలయం ముందు బహిరంగ సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత రాజనర్సు వహించగా వేదికమీద ఏఐటియుసి జిల్లా బాధ్యలు ఎల్. దశరథ్. ఏఐటియుసి జిల్లాఅధ్యక్షుడు రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ఏఐటియుసి జిల్లా కోశాధికారి. పి. బాలరాజు. ఏఐటియుసి సీనియర్ నాయకుడు నరసింహ రెడ్డి, సిఐటియు జిల్లా కన్వీనర్ ఎల్లన్న, సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్, మహబూబ్, సంతోష్ ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు మాలహరి, ఐఎఫ్టియు రాజు, ...
Read More »అర్థ శాస్త్ర విభాగంలో పిహెచ్డి
డిచ్పల్లి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో ఏ.పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి సౌందర్య ప్రపంచీకరణ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు అనే సిద్ధాంత గ్రంధానికి ఆన్లైన్లో నిర్వహించిన పిహెచ్డి వైవ -ఓస్‌కు బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.రామాంజనేయులు ఎక్స్టర్నల్ ఎక్సమినర్గా, సోషల్ సైన్స్ డీన్ ప్రొ.కే.శివశంకర్ ముఖ్య అతిధిగా హాజరై అభినందించారు. సౌందర్య తన విస్తత పరిశోధనలో ప్రపంచీకరణలో భాగంగా వ్యవసాయరంగంలో భారీగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు రైతులను ...
Read More »‘మనము మన రాజ్యాంగం’ పుస్తకావిష్కరణ
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సామాజిక సమరసత వేదిక అద్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్ సూతరి రవి ‘మనము మన రాజ్యాంగం’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సమైక్యత, దేశ అఖండతతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రవచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలని ప్రజల్లో అవగాహన నింపడానికి రాజ్యాంగ విధివిధానాలు ...
Read More »మన రాజ్యాంగం మనకెంతో గర్వకారణం
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రగతి భవన్లో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం భారత దేశానికి రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా తయారుచేయడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చర్చించి, శోధించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలను, వారి జీవన పరిస్థితులను దష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు దిక్సూచిగా ...
Read More »యాంత్రీకరణపై రైతులకు అవగాహన
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాగులో యంత్రాల ఉపయోగం, ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెంచుకోవడంపై రైతులకు జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్లో వ్యవసాయ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమైన వ్యవసాయ పనులు నిర్వహించుకునే సమయంలో రైతులకు నాటు వేయడం, కలుపు తీయడం, పంటలు కోయడం తదితర ...
Read More »శ్వాస సంబంధిత వ్యాధి గ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కాలానుగుణంగా వ్యాపించే వ్యాధుల నివారణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలను మైక్ ద్వారా ప్రచారం చేశారు. ప్రస్తుతం కోవిడ్ 19 వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు నివారణ, నియంత్రణ గురించి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విస్తతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో ...
Read More »