రెండు పడక గదుల ఇళ్ళ ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల లబ్ధిదారులందరికీ రెండు పడకల ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. మొదట బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామ్‌ రావు మహరాజ్‌ గారి మతి పట్ల 2 నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

ఆదివారం బాన్సువాడ మండలం తాడుకోల్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళ పట్టాలను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డా. ఎ. శరత్‌, ఆర్డీవో రాజా గౌడ్‌, తెరాస యువనాయకులు పోచారం సురేందర్‌ రెడ్డితో కలిసి పంపిణీ చేసి, వారికి ఇంటి తాళాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బాన్సువాడ మండల తెరాస పార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, ఏంఎసి చైర్మన్‌ పాతబాలకష్ణ, బాన్సువాడ ప్యాక్స్‌ చైర్మన్‌ కష్ణ రెడ్డి, మండల నాయకులు దొడ్ల వెంకటరామ్‌ రెడ్డి, ఎజాజ్‌ ఖాన్‌, గురు వినయ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, అలీముద్దీన్‌ బాబా, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article