న్యాయం చేస్తాం…

నిజామాబాద్‌, నవంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత స్వగహంలో జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు నిరుగొండ బుచ్చన్న, గోసంగి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్‌ తదితరులతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎం.ఎల్‌.సి ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేసి గోసంగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లా గోసంగీలు ఎదుర్కొంటున్న సమస్యలను కవితకు వివరించారు.

ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ గోసంగీలు అత్యంత వెనుకబడి ఉన్న విషయం తమ దష్టిలో ఉన్నందున వారికి న్యాయం చేస్తామని ఎంఎల్‌సి కవిత అన్నారన్నారు. త్వరలో గోసంగిలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కవిత హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article