Breaking News

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, నవంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలులో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ హెచ్చరించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని కోరారు.

కొనుగోలు కేంద్రానికి రాగానే రైతు పేరును ఏఈఓలు నమోదు చేసుకోవాలని, వరుసక్రమంలో టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోళ్లు చేపట్టాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్‌లో ప్రతిరోజు ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలని కోరారు. కొనుగోలు కేంద్రానికి లారీ వచ్చిన నాలుగు గంటల లోపు కూలీలను సమన్వయపరిచి లోడింగ్‌ చేయించ వలసిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. రైస్‌ మిల్‌కు చేరిన తర్వాత నాలుగు గంటల లోపు మిల్లు యజమానులు అన్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. మైసర్‌ వచ్చిన వారికి కొనుగోలు కేంద్రంలో గన్ని బస్తాలు ఇవ్వాలని కోరారు.

పర్యవేక్షణ అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రతినిత్యం పరిశీలన చేయాలని సూచించారు. మీ సేవ కేంద్రాల వద్ద ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుకింగ్‌ కొరకు రూ.200 చెల్లించాలనే పెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణిలో రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచే విధంగా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని సునీత, డిసిఓ శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారిని రమ్య, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article