నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, సఖి కేంద్రంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో కొనసాగుతున్న సఖి కేంద్ర కార్యాలయంలో ముందుగా పర్యటించిన కలెక్టర్ ప్రజల నుండి కేంద్రానికి వస్తున్న ఫిర్యాదులు ప్రజల స్పందన వాటి పరిష్కారాలు తదితర వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు వచ్చినాయి, అందులో ఏ రకమైన ఫిర్యాదులు ఉన్నాయో వాటి పరిష్కారానికి అధికారులు ఏ విధమైన చర్యలు ...
Read More »Daily Archives: November 5, 2020
కేంద్రాల్లో ధాన్యం నిలువ ఉండకుండా చూడాలి
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ, సహకార అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమ 17 శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ప్రతిరోజు రైతులు విక్రయించిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసే విధంగా చూడాలని కోరారు. కేంద్రాల్లో ధాన్యం నిలువలు ఉండకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ...
Read More »పిహెచ్డి విద్యార్థులకు గమనిక
డిచ్పల్లి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్.డి. బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాక్ లాగ్ పరీక్షలకు 2012-13, 2013-14 బ్యాచ్‌లకు చెందిన ఆర్ట్స్ ఫాకల్టీ కోర్సులు ఇంగ్లీష్, హింది, తెలుగు, ఉర్దూబీ సోషల్ సైన్స్ ఫాకల్టీ కోర్సులు అప్లైడ్ ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్బీ సోషల్ వర్క్, లా, కామర్స్, బిజినెస్ మేనేజ్ ...
Read More »ఇద్దరికి కరోనా పాజిటివ్
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ర్యాపిడ్ ఆంటీజెన్ కిట్ ద్వారా 56 మందికి కరోన టెస్ట్‌లు నిర్వహించినట్టు వైద్యాధికారి షాహీద్ అలీ తెలిపారు. కాగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, ఒక్కరు రామారెడ్డి గ్రామస్తులు, ఒక్కరు గర్గుల్ గ్రామస్థులని వైద్యాధికారి పేర్కొన్నారు.
Read More »ఆత్మ పరిశీలన గొప్ప లక్షణం
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనిషి తనను తాను పరిశీలించు కోవడం, అర్థం చేసుకోవడం గొప్ప లక్షణం అని, తనలోకి తాను చూసుకో గలిగితే ధైర్యం సాహసం కరుణ మానవత్వం మనిషికి అలవడతాయని నరాల సుధాకర్ నేను అనే శీర్షికతో కవిత్వం రాస్తూ తన అంతరంగాన్ని నిరంతరం దర్శిస్తూ సమాజంలో ఆదర్శంగా ఎదుగుతాడని శాసన మండలి సభ్యురాలు తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని తన కార్యాలయంలో కవిత ...
Read More »23 సంవత్సరాలుగా ఒకే స్కూల్లో…
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రైవేట్ పాఠశాల మహిళా కరస్పాండెంట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన, విధుల్లో అవినీతి, అలసత్వం ప్రదర్శిస్తున్న బర్కత్‌పుర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కపాల్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, వేరే చోటికి బదిలీ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. డీఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన ...
Read More »7 న ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ – 2021 వాలంటీర్స్ ఎంపిక పోటీలు
డిచ్పల్లి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ -2021 ఎంపికకు పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని క్యాంటీన్ పరిసర ప్రాంగణంలో జరుగనున్నాయని ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డా. ప్రవీణా బాయి ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్స్‌కు చెందిన వాలంటీర్స్ అర్హులని ఆమె తెలిపారు. కావున ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ ప్రతిభ ...
Read More »రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. గురువారం ఆయన తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతి మండలంలో రోజుకు ఐదు చొప్పున స్లాట్ బుకింగ్ అయ్యే విధంగా చూడాలని కోరారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచే విధంగా చూడాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్ఏలతో ధరణిలో రిజిస్ట్రేషన్లు చేసే విధానంపై గ్రామీణులకు అవగాహన చేయాలన్నారు.
Read More »ఈనెల 12 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి , నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలు ఈనెల 12 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జనహితలో గురువారం ఉపాధి హామీ, ఎంపీడీవో, ఎంపిఓలతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ప్రగతి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకతి వనాలను ఉద్యానవనాలుగా తీర్చిదిద్దాలన్నారు. వనంలో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం, సాయంత్రం పూట ప్రకతి వనం ...
Read More »