కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు తీసుకున్న పంట రుణాన్ని ఏడాది (364) రోజులలోపు చెల్లిస్తే వారికి పావలా వడ్డీ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. కామారెడ్డి జనహితలో శుక్రవారం బ్యాంక్, ఐకెపి, స్త్రీనిధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు చెల్లించి పావలా వడ్డీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాలకు సెప్టెంబర్ వరకు చెల్లించే రుణాలను అధిగమించిన ఐకెపి అధికారులకు, బ్యాంకు అధికారులకు ప్రశంసాపత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ...
Read More »Daily Archives: November 6, 2020
వారంలో రెండు సార్లు అంగన్వాడి డే
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్వాడి కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి గర్భిణీల నమోదు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి జనహితలో ఐసిడిఎస్, వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంచి కేసులు లేకుండా చూడాలని కోరారు. గ్రామస్థాయిలో ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రసవాలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ...
Read More »కామారెడ్డి విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 9వ తేదీ సోమవారం ఉదయం 10 .30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు కన్జ్యూమర్ గ్రీవెన్స్‌లో విద్యుత్ సమస్యలపై పరిష్కారం జరుగుతుందని డివిజనల్ ఇంజనీర్ గణేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున కామారెడ్డి టౌన్, కామారెడ్డి రూరల్, తాడ్వాయి మండలంలో గల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఫిర్యాదు చేసి పరిష్కారం పొందగలరని పేర్కొన్నారు. కామారెడ్డి ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసులో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా జరుపనున్నట్టు ఆయన ...
Read More »అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం…
బోధన్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమవి రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్న పాలకులు, ఆరుగాలం కష్టపడి పండిచిన పంటలు ప్రకతి వైపరీత్యాల మూలంగా కొంత నష్టపోతే పాలకుల విదానాల మూలంగా మరింత నష్టాల పాలవుతున్నామని, రైతు పాలకుల ”రైతు వ్యతిరేక విధానాలను” నిరసిస్తూ ఆందోళనకు దిగితే, రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పుకునే పాలకులు రైతులను, వారికోసం పోరాడుతున్న రైతు సంఘాల నాయకులను అడ్డుకోవడం సిగ్గుచేటని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ ...
Read More »ముగిసిన డిగ్రీ పరీక్షలు, 9 నుంచి ఇయర్ వైస్ పరీక్షలు
డిచ్పల్లి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా లాక్ డౌన్ విధింపబడి విద్యా సంవత్సరానికి, పరీక్షలకు, మూల్యాంకనానికి కొంత కాలం సందిగ్ధత ఏర్పడి, తదనంతరం భయాందోళనల నుంచి తేరుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. గత నెల 21 కి ప్రారంభమైన డిగ్రీ కోర్సులకు చెందిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ. (ఎల్) పరీక్షలు, ఎడ్యూకేషన్ కోర్సులకు చెందిన బి.ఎడ్., ఎం.ఎడ్. పరీక్షలు, లా కోర్సులకు చెందిన ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎం. పరీక్షలు ...
Read More »సీడ్లింగ్ పనులు వేగవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలలో వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి మొక్కలను పెంచే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో డిక్ట్రిక్ట్ ల్యాండ్ ఆడిట్, హరితహారం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీలు వచ్చే ఏడాదికి మొక్కలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన టార్గెట్లు పూర్తి కావాలని, డిమాండ్ మేరకు మొక్కలు పెంచాలన్నారు. నర్సరీల విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ...
Read More »అట్రాసిటీస్ కేసులు త్వరగా పరిష్కరించాలి
నిజామాబాద్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అట్రాసిటీస్ కేసులు త్వరగా పూర్తిచేసి వారికి నిర్ణీత సమయంలో న్యాయం జరిగే విధంగా, పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పోలీసు, సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లాస్థాయి అట్రాసిటీస్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అట్రాసిటీ కేసులు 2011 నుండి 2018 వరకు 95 కేసులు వచ్చాయని, వాటిలో పోక్సో చట్టం క్రింద 40 కేసులు, అత్యాచార కేసులు 6 వచ్చాయని, ...
Read More »రూర్బన్ పనులు వేగవంతంగా జరగాలి
నిజామాబాద్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూర్బన్ పథకం క్రింద పనులు వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో శుక్రవారం ఎడపల్లి మండల ప్రజా ప్రతి నిధులు, అధికారులతో మండలంలో జరుగుగుతున్న రూర్బన్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అతి సమీపంలో ఉన్న ఎడపల్లి మండలాన్ని రూర్బన్ క్రింద ఎంపిక చేయడం మండల ప్రజల అదష్టమని, పనుల వేగవంతానికి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ...
Read More »