Breaking News

సీడ్లింగ్‌ పనులు వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలలో వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి మొక్కలను పెంచే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో డిక్ట్రిక్ట్‌ ల్యాండ్‌ ఆడిట్‌, హరితహారం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీలు వచ్చే ఏడాదికి మొక్కలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఇచ్చిన టార్గెట్లు పూర్తి కావాలని, డిమాండ్‌ మేరకు మొక్కలు పెంచాలన్నారు. నర్సరీల విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఉందని, అందువల్ల మున్సిపాలిటీలకు అవసరమైన మొక్కలను నర్సరీలలో విత్తుటకు అవసరమైన అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు.

మున్సిపాలిటీలో వాహనాలు ఏ మేరకు అవసరమో వాటిని సమకూర్చుకోవాలన్నారు. క్రిమిటోరియం, ఓపెన్‌ జిమ్‌లు పనుల పురోగతితో పాటు ప్రతి మున్సిపాలిటీలో ఎన్ని క్రిమిటోరియంలు అవసరమో అన్ని వివరాలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీలో టాయిలెట్స్‌, స్ట్రీట్‌ వెండర్‌, ప్రకతి వనాలపై మున్సిపల్‌ వారీగా సమీక్ష చేశారు. సమావేశంలో సంబంధిత అధికారులు హాజరయ్యారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article