నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ నుండి ప్రగతి భవన్ ముందు రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12న రైతు కష్టానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు మౌన దీక్ష చేపడుతున్నట్లు తెలంగాణ రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు విజయ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి, కార్యనిర్వహణ అధ్యక్షులు రమేష్ రెడ్డి తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. సన్నరకం వడ్ల ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయలు చెల్లించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ...
Read More »Daily Archives: November 7, 2020
టియులో రిపబ్లిక్ డే పరేడ్ ఎంపిక పోటీలు
డిచ్పల్లి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ -2021 ఎంపికకు పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని గెస్ట్ హౌస్ పరిసర ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డా. ప్రవీణా బాయి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఎన్ఎస్ఎస్ జెండా ఆవిష్కరించి, స్పోర్ట్స్ జెండా ఊపి పరేడ్ పోటీలను ప్రారంభించారు. వాలంటీర్లందరు ఎన్ఎస్ఎస్ జాతీయ గీతం ...
Read More »కామారెడ్డి ప్రథమ స్థానంలో ఉంది…
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేయడంలో తెలంగాణలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 434 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు 20 నిమిషాల వ్యవధిలోనే మూటేషన్ పూర్తిచేసి పాస్ పుస్తకం నకలు అందజేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఒక రిజిస్ట్రేషన్‌ను ...
Read More »మద్దతు ధర లేక పంట తగులబెడుతున్నారు
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం భారత కమ్యునిస్ట్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కామారెడ్డి కౌన్సిల్ నిర్వహించారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ మాట్లాడారు. ఈనెల 26 న జరిగే సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 26న జరిగే బందుకు సిపిఐ కామారెడ్డి జిల్లా మండల గ్రామాల మద్దతు ఇవ్వాలన్నారు. ధరణి పేరుతో ఎల్ఆర్ఎస్ పేరుతో రైతులను పేదప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర లేక పండించిన పంటను సైతం ...
Read More »తండావాసులకు శుభవార్త
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా గజ్యానయక్ తాండ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రుపాయలు మంజూరు చేయించినందుకు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్దన్‌కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గ్రామ సర్పంచ్ హంజీనాయక్ తెలిపారు. కార్యక్రమంలో మాచారెడ్డి జెడ్పీటీసీ మినుకురి రాంరెడ్డి, మాచారెడ్డి మండల పార్టీ అద్యక్షులు హంజీనాయక్, కామారెడ్డి యం.పి.పి పిప్పిరి ఆంజనేయులు, మదుసుదన్ రావు, గోపాల్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ...
Read More »అసత్య ఆరోపణలు సరికాదు
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ కౌన్సిలర్లు చెత్త వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అన్నారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పాలకవర్గం వచ్చాక పట్టణ అభివద్ధిపై ప్రత్యేక దష్టి పెట్టి ముందుకు వెళ్తున్నామని, పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి వార్డుకు దాదాపు 40 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని, అయినా అభివద్ధి జరగడం లేదని బీజేపీ కౌన్సిలర్లు దుష్ప్రచారం చేస్తున్నారని ...
Read More »మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలి
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్లో ఎంపి లాడ్స్, రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్అండ్బి శాఖల ఈఈ, డిఈ, ఏఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికల పనుల అభివద్ధి గురించి మండలాల వారీగా సమీక్షించారు. 5 రోజులలోనే ప్రతి మండలంలో పనులు పూర్తి ...
Read More »