నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మైసమ్మ వీధి మున్నూరు కాపు సంఘం తర్ప ఆధ్వర్యంలో ఆదివారం బోనాల (కడల) పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయం కోటగల్లీ మైసమ్మ వీధిలోగల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున్న బోనాల పండగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. మహిళలతో పాటు పురుషులు సైతం బోనాలు (కడలు) నెత్తిన ఎత్తుకుని మైసమ్మ వీధి నుండి పోచమ్మ గల్లీలోని పెద్దపోచమ్మ ఆలయానికి డప్పు వాయిద్యాలతో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ తల్లికి బోనాలు ...
Read More »Daily Archives: November 8, 2020
మిల్లర్లు కడ్తా తీస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ అధికారులు నాణ్యమైన ధాన్యాన్ని ధ్రువీకరణ చేసిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. అధికారులు ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్ నుండి వ్యవసాయ, సహకార, రెవెన్యూ, సివిల్ సప్లైస్, డిఆర్డిఓ, తదితర అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైతులకు ధాన్యం సేకరణపై మరియు ఇతర విషయాలపై మెసేజ్ ...
Read More »తెరాసలోకి సీనియర్ కాంగ్రెస్ నేతలు
ఆర్మూర్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, కోటార్మూర్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, ఎస్కె అసిఫ్, చిలక రాజు, ఎండి అసిఫ్, నసీరుద్దీన్ మరియు 100 మంది యువకులు ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరినారు. పెర్కిట్ మాజీ వార్డ్ మెంబర్ ఆసీఫ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మరియు జీవన్‌రెడ్డి చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెరాస పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకుడు ...
Read More »