శుభ్రమైన ఆహారం తీసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేశారు. పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు.

కాలానుగుణంగా సంక్రమించే వ్యాధులు ప్రభల కుండా తగు నివారణకు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మర్లకుంటా తండాలో కలుషిత నీరు, ఆహారపదార్థాలు తీసుకోవడం వలన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారని, తాండవాసులు అందరూ వేడి చేసి చాలార్చిన నీరు తాగాలని, శుభ్రమైన ఆహారం తీసుకోవాలన్నారు. మాస్‌ మీడియా అధికారులు ప్రచారం చేశారు.

కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని తన కుటుంబ సభ్యులు అందరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, జనం గుంపులుగా చేరకూడదు, తరుచుగా చేతులు శుభ్రపరచుకోవాలని పేర్కొన్నారు. పిల్లలు, గర్భిణీలు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిసరాలు పరిశుభ్రత పాటించి అంటువ్యాధులు సోకవని వివరించారు.

ప్రచారంలో డాక్టర్‌ హారిప్రసాద్‌, డాక్టర్‌ ఇనాయత్‌, వి.సంజీవరెడ్డి ఎం.రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు, హాబీబుద్దిన్‌ హెచ్‌ఇవో కామారెడ్డిలో విద్యానగర్‌, కల్కినగర్‌, బస్టాండ్లలో, మున్సిపల్‌ రోడ్‌, నిజాంసాగర్‌ రోడ్‌ దేవనపల్లిలో మరియు గాంధారి మండలంలో మర్లకుంటా తండా, పెత్సంగంలో ప్రచారం చేసారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article