Breaking News

Daily Archives: November 13, 2020

బాలల జీవితాల్లో వెలుగులు నింపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల దినోత్సవం సందర్భంగా చైల్డ్‌ లైన్‌ 1098 రూపొందించిన బాలల హక్కుల పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. బాలల జీవితాల్లో వెలుగులు నింపాలని బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. బాల్య వివాహాలు, బాలలపై హింస జరుగకుండా చూడాలని కలెక్టర్‌ తెలిపారు. పోస్టర్ల ఆవిష్కరణలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ పాటిల్‌, జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీలక్ష్మి బిఆర్‌వి కోఆర్డినేటర్‌ స్వర్ణలత, బిసిపిఓ చైతన్య, ...

Read More »

రుణాలు పొందేలా అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకునే విధంగా వారికి గ్రామాలలో అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బ్యాంకుల డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వానాకాలంలో నాలుగు శాతం యాసంగిలో అక్టోబర్‌ వరకు కేవలం 7.74 శాతం మాత్రమే రుణాలు పొందారని తెలిపారు. కారణాలను విశ్లేషించగా రైతులు ...

Read More »

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నరక చతుర్దశి, దీపావళి సందర్బంగా రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్బంగా జిల్లా ప్రజల అందరి జీవితాలలో వెలుగులు విరజిమ్మాలని, అందరి కళ్ళలో కాంతులు వెదజల్లాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నామని, పర్యావరణ హిత పటాకులు ఉపయోగించాలని కోరుతున్నట్లు ప్రకటనలో కోరారు.

Read More »

ధాన్యం వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొని రాగానే వ్యవసాయ అధికారులు ధవీకరించిన ప్రకారం వెంటనే ధాన్యాన్ని తూకం వేసి రైస్‌ మిల్లులకు పంపే ఏర్పాట్లు వేగంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కేంద్రాల ఇంచార్జిలను ఆదేశించారు. శుక్రవారం ఆయన మోపాల్‌ మండల కేంద్రంలోనూ కస్బా తాండలోనూ, శ్రీరామ్‌ నగర్‌ తాండ లోనూ కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పర్యటించి ధాన్యం సేకరణ నాణ్యత తూకం వేయడం తదితర విషయాలు పరిశీలించారు. ...

Read More »

పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

నాణ్యతా ప్రమాణాల ప్రకారం తీసుకురండి… కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ప్రత్తి రైతులు తమ ప్రత్తిని సి.సి.ఐ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి మరియు ప్రభుత్వ మద్దతు ధర రూ.5825 పొందటానికి రైతులు తమ ప్రత్తిని బాగా ఆరబెట్టుకొని 8 శాతం తేమ మించకుండా నాణ్యతా ప్రమాణాల ప్రకారం ప్రత్తిని తీసుకొనిరావాలని కామారెడ్డి మార్కెటింగ్‌ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తేమ 8 శాతం కంటే ఎక్కువ ఉంటే ప్రతి ఒక్క శాతానికి రూ. 55.50 చొప్పున ...

Read More »

సన్నరకం ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా నిర్దారించాలి

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సన్న రకం వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్‌ గా నిర్ధారణ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి జనహితలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మిల్లర్లు, అధికారులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యానికి వరుస క్రమంలో క్రమ సంఖ్య ఇవ్వాలని సూచించారు. మైసర్‌ వచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేపట్టాలని పేర్కొన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని అన్‌లోడింగ్‌ చేసిన తర్వాత దాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు ...

Read More »

26న దేశవ్యాప్త సమ్మె

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని యూనియన్‌ కార్యాలయం శ్రామిక భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తున్నదన్నారు. సులభతర వ్యాపారం అనే పేరుతో ...

Read More »

కబ్జాకోరులు కన్నువేశారు… కాపాడుకుందాం…

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములకు పూర్తి స్థాయిలో ప్రహరీ గోడ నిర్మాణం విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడారు. రూపాయి రూపాయి కూడాబెట్టి రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకొని, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగి, కామారెడ్డిలో ఎంతో మంది పేద ...

Read More »

ఈనెల 26 నుంచి పరీక్షలు

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల తేదీలను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు విడుదల చేసారు. మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్‌ 26వ తేదీ నుంచి డిసెంబర్‌ 9 వరకు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు 27 నవంబర్‌ నుంచి 10వ తేదీ డిసెంబర్‌ వరకు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, మరిన్ని వివరాలు, సందేహాల ...

Read More »

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బాణాసంచా, టపాకాయలు అమ్మినా, కాల్చినా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం బాణాసంచా, టపాసులు అమ్మడం, కాల్చడం పట్ల నిషేధం విధించిందని, జిల్లాలో టపాసులు, బాణాసంచా షాపులు తప్పనిసరిగా మూసివేయాలని, అలాగే ఎవరు కూడా టపాసులు, బాణాసంచా కాల్చరాదని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ అట్టి ...

Read More »