Breaking News

20 నుంచి స్వామివారి బ్రహ్మూెత్సవాలు

ఆర్మూర్‌, నవంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 1 వరకు శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి నిత్య బ్రహ్మూెత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీ శ్రీవారు గ్రామాలయం నుంచి కొండపైకి బయల్దేరుతారని, 21న దీపారాధన, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురార్పణము, శ్రవణ ప్రయుక్త క్షీరాభిషేకం, విష్ణుపంచకం ఉంటుందన్నారు.

అదేవిధంగా 22న గరుడపటాధివాసము, ధ్వజారోహణము, 23న కుష్మాండనవమి, శ్రీవారి కళ్యాణము ఎదురుకోలు ఉంటాయన్నారు. 24న శ్రీవారి కళ్యాణము, 25న హరివాసరము, 26న భాగవతానాం ఏకాదశి, చాతుర్మాస్య వ్రతసమాప్తి, గరుడసేవ ఉంటాయన్నారు. 27న ఉత్థాన ద్వాదశి, అల్ప ద్వాదశి, తులసీ వివాహము, కొండ ప్రదక్షిణము ఉంటాయన్నారు. 28న వైకుంఠ చతుర్ధశి, నృసింహ పూజ, సీతానగరముపై డోలారోహణము, జాతర, 29న చతుర్ధశి ఉపరి పౌర్ణిమ, శ్రీవారి రథభ్రమణము జరుపుతామన్నారు.

30న శేష పౌర్ణిమ, శేష హోమము, తిరుమంజనము, పూర్ణాహుతి, రాత్రి పుష్పయాగము, డిసెంబర్‌ 1న దేవతోద్వాసనము, ధ్వజారోహణము, ఉద్వాసన, బలిప్రదానము, కొండబలి, సాయంత్రం శ్రీవారు గ్రామానికి వేంచేయుట, అశ్వవాహనముపై గ్రామాలయానికి ఊరేగింపు, సప్తవరణపూజతో ఉత్సవ సమాప్తి జరుగుతుందన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article