Breaking News

హిందూ పరిరక్షణ చట్టం కోసం మహిళ సైకిల్‌యాత్ర

కామారెడ్డి, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందు పరిరక్షణ చట్టం తేవాలని, దేవాదాయ శాఖ రద్దు చేసి దేవాలయాల హుండీ డబ్బును హిందూ ధర్మ పరిరక్షణకు వెచ్చించాలని డిమాండ్‌ చేస్తూ వేములవాడకు చెందిన సాధారణ మహిళ మధులత గత మూడు రోజుల క్రితం సైకిల్‌ యాత్ర చేపట్టారు. వేములవాడ నుండి డిల్లి వరకు దాదాపు 1500 కిలోమీటర్ల సైకిల్‌పై ప్రయాణించి ప్రధాని నరేంద్ర మోడికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళుతూ బుధవారం రాత్రి కామారెడ్డికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ తరుపున స్వాగతం పలికి గురువారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ ఝాన్సీ లక్మి భాయి స్పూర్తితో ధర్మం కోసం హిందూ దేవాలయాలు పరిరక్షణ కోసం యాత్ర చేపట్టానని, హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో మోదీ మీద పూర్తి నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆలయాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు హరీష్‌ జోషి మాట్లాడుతూ మసీదులు, చర్చిలపై లేని ప్రభుత్వ అజమాయిషీ ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు హిందువులను, దేవుళ్లను తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని ఇలాంటి చర్యలు మరలా జరగకూడదంటే హిందూ అట్రాసిటీ చట్టం తేవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, తదితరులున్నారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article