కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్వర్యంలో 2 కుట్టు మిషన్స్ గర్గుల్ గ్రామానికి చెందిన ఒకరికి ఇంకొకరు ఇంద్రనగర్ కాలనీకి చెందిన పేదవారికి అందించారు. అలాగే సరంపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అండ్ మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కామారెడ్డి అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం శారద వద్ధాశ్రమంలో చలి కాలాన్ని దష్టిలో పెట్టుకొని వద్దులకు ఉచితంగా రగ్గులు పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హన్మంత్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ రమణ, రోటరీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, రోటరీ సెక్రెటరీ దత్తాత్రి, డాక్టర్ సి.హెచ్. సజిత్, 6 వ వార్డ్ కౌన్సిలర్ రూప రవికుమార్ సరంపల్లి, మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేష్, స్కూల్ హెడ్ మాస్టర్ దేవేందర్, రోటరీ కోశాధికారి అమర్నాథ్, రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ అనిత, రోటరీ మెంబెర్స్ బాలకిషన్, సుభాష్ చంధ్, హరిస్మరన్ రెడ్డి, కాశీనాథం,శంకర్, ధనుంజయ్, గ్రామపెద్దలు రాజు, బాలరాజు, అంజంకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021