Breaking News

శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు

నిజామాబాద్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శని, ఆదివారాల్లో అనగా ఈనెల 21, 22 తేదీలలో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో ఎస్‌ఎస్‌ఆర్‌ పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 21, 22 తేదీలలో 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్‌ నమోదుకు అర్హులని వారందరూ కూడా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ రెండు రోజులలో అన్ని పోలింగ్‌ కేంద్రాలలో బూత్‌ లెవెల్‌ అధికారులు ఉదయం 8 గంటల నుండి ఆయా పోలింగ్‌ కేంద్రాలలో అందుబాటులో ఉండి తమ వద్ద ఫారం 6, 7, 8, 8 ఎ అందుబాటులో ఉంచుకోవాలని ఓటరు నమోదు కొరకు వచ్చే వారికి సంబంధిత ఫారాలు అందించి తిరిగి వాళ్ళ చేత పూర్తి చేసిన ఫారాలను తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తమ వద్ద ఆ పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి ఓటర్ల జాబితా ఉంచుకొని మార్పులు చేర్పులకు అవసరమైన వివరాలు నమోదు చేసుకోవాలని, చనిపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ పక్కన మరణించినట్లు రాసుకోవాలని పేర్కొన్నారు.

దానితోపాటు పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఎవరైనా శాశ్వతంగా మై గ్రేట్‌ అయి ఉంటే ఆ వివరాలు, కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకొని లేదా ఇతర కారణాల వల్ల పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి శాశ్వతంగా వచ్చినట్లయితే వారి వివరాలను కూడా తీసుకొని అన్ని వివరాలను కూడా ఒక రిజిస్టర్లో ఫారాల వారిగా నమోదు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం తర్వాత ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్లు ఉన్నా, మైగ్రేట్‌ అయి ఉన్నా ఆ వివరాలు లేదా చనిపోయిన వారు ఉంటే ఆ వివరాలను కూడా తమ ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయంలో ఆర్‌డివోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డిసెంబర్‌ 5, 6 తేదీలలో కూడా ఇదే విధమైన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను కూడా ఈ ప్రత్యేక ఓటరు నమోదు పక్రియలో భాగస్వాములను చేసి అర్హులైన ప్రతి ఒక్క యువతీ యువకులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

ఈ సమాచారం వీలైనంత ఎక్కువ మందికి చేరే విధంగా గ్రూపులలో షేర్‌ చేయాలని సూచించారు. సెల్‌ కాన్ఫరెన్సులో ఆర్‌డివోలు తహసీల్దార్లు నియోజకవర్గ ఈఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article