నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శంకర్ భవన్, చైతన్య పబ్లిక్ స్కూల్ కేంద్రాలలో శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా నమోదు కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు, నమోదు ప్రక్రియ, ఏ రకమైన ఫారాలకు వస్తున్నారో బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు.
2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదుకు అర్హులని, అలాంటి వారి అందరి నుండి ఫారం 6 తీసుకొని వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో పంపాలన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఓటర్ల జాబితాలో మరణించిన వారి వివరాలు కానీ, శాశ్వతంగా వెళ్ళిపోయిన వారి వివరాలు గానీ, కొత్తగా వచ్చిన వారి వివరాలు కానీ ఉంటే నమోదు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఫారాలను వారిచేత పూర్తి చేయించి తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్ని వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ నెల 22 ఆదివారం కూడా బూత్ లెవల్ అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలలో సంబంధిత పత్రాలతో ఉదయం 8 గంటల నుండి అందుబాటులో ఉండి వచ్చిన ప్రజలకు అవసరమైన ఫారాలు అందించి పూర్తి చేయించి తీసుకోవాలని, ఎక్కడైనా తేడా వస్తే, లేదా పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021