నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల రవీందర్ మతదేహాన్ని వారి స్వగహం గూపన్ పల్లికి తెప్పించారు ఎమ్మెల్సీ కవిత. బ్రతుకుపై ఆశతో ఈయేడు జనవరిలో పొట్ట చేత పట్టుకొని మలేషియా వెళ్లిన బాల రవీందర్ కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి ఎన్నో కష్టాలు పడి జీవితంపై ఆశ కోల్పోయి గుండెపోటుతో గత నెల 24న మరణించగా, అతనికి అప్పులు ఉండడంతోతో పార్థివ దేహాన్ని స్వగహానికి తెప్పించడానికి వారి కుటుంబ సభ్యులకు సాధ్యం కాలేకపోయింది.
రవీందర్ సోదరుడు సుదర్శన్, తెలంగాణ జాగతి జిల్లా అధ్యక్షులు అవంతి ఈ విషయాన్ని తెలంగాణ జాగతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారికి తెలపడంతో నవీన ఆచారి ఇట్టి విషయాన్ని ఎమ్మెల్సీ కవిత దష్టికి తీసుకెళ్ళారు. ఎమ్మెల్సీ కవిత మలేషియా భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో మలేషియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతికి ఈ విషయంపై చొరవ తీసుకొని రవీందర్ పార్థీవదేహం దేశానికి వచ్చేటట్టు చూడమని కవిత కోరారు.
ఆ సమయంలో దాదాపు పది పదిహేను రోజులు తిరుపతి భారత రాయబార అధికారులతో మాట్లాడుతూ కావలసిన పత్రాల విషయం కవితకి చెబుతూ ఎమ్మెల్సీ కవిత ద్వారా సహాయం తీసుకొని అన్ని పనులు పూర్తి చేయించి శనివారం పార్థివదేహాన్ని విమానం ద్వారా మన దేశానికి పంపించారు. శంషాబాద్ నుండి గూపన్ పల్లికి పార్థివ దేహం చేరేటట్టుగా ఎమ్మెల్సీ ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు.
బాల రవీందర్కి ఇద్దరు పిల్లలు ఉండడంతో వారి చదువుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆదివారం ఉదయం గూపన్ పల్లిలోని రవీందర్ స్వగ హానికి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021