ఓటరు నమోదు పారదర్శకతతో నిర్వహించాలి

కామారెడ్డి, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జాగ్రత్తగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన కామారెడ్డి మండలం పాతరాజంపేట, నరసన్నపల్లి గ్రామాలలోని పోలింగ్‌ బూతులను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 2021 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21, 22 తేదీలలో, వచ్చే డిసెంబర్‌ నెల 5, 6 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 18 ఏళ్ళ వయస్సు నిండిన వారందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు.

అంతేకాకుండా ఓటరు జాబితాలో ఏమైనా తప్పులుంటే సవరించడం జరుగుతుందని, పోలింగ్‌ బూత్‌ మార్పిడి చేయడం, కొత్త వారి పేర్లు నమోదు చేయడం, చనిపోయిన వారి పేర్లు తొలగించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో దరఖాస్తులను బూత్‌ లెవల్‌ అధికారులు స్వీకరిస్తారని తెలిపారు.

సంబంధిత ధరఖాస్తు ఫారాలు ఫారం 6, 7, 8, 8 ఎ పోలింగ్‌ బూత్‌లలో అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహశీలుదారు అమీన్‌ సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ...

Comment on the article