కామారెడ్డి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి మండలంలో తిమ్మక్‌పల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మరియు విజయ డైరీ సంయుక్తంగా గ్రామంలోని పాడి రైతులకు పశుగ్రాసం, పశుపోషణ యాజమాన్యం పద్ధతులపై అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ మేనేజర్ మమత మాట్లాడుతూ కెసిసి లోన్ గురించి వివరించి పాడి రైతులకు 8 మందికి కెసిసి చెక్కులు పంపిణీ చేశారు.
అలాగే బ్యాంకు ద్వారా గేదెలకు 50 వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, అలాగే మినీ డైరీకి రెండు లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే బ్యాంకు ఖాతాల గురించి ఇన్సూరెన్స్‌ల గురించి తెలిపారు. అలాగే ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్‌లోని ప్రీమియం టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మరియు ఫిక్స్ డిపాజిట్ తెలిపారు. విజయ డైరీ సూపర్వైజర్ నర్సింలు మాట్లాడుతూ జెఎల్‌జి పథకం గురించి తెలియజేస్తూ విజయ డైరీలోని గడ్డి విత్తనాల గురించి గడ్డి జాతుల గురించి వివరించారు.
అలాగే పశుగ్రాసం పశు పోషణ గురించి రిసోర్స్ పర్సన్ రాజేశ్వర్ పశుపోషణ పద్ధతులు మరియు మేలు జాతి పశువుల ఎంపిక విధానం, పశువుల కొట్టం నిర్వహణ గురించి వివరించారు. ఐకెపి సిసి ప్రవీణ్ మాట్లాడుతూ స్త్రీ నిధి ద్వారా పశువుల లోన్ గురించి వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మణ్ మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా అజోలా, ఏకవార్షిక మరియు బహు వార్షిక గడ్డి జాతుల పెంపకం పథకాల గురించి చెప్పారు.
విజయ డైరీ అధ్యక్షులు సాయిలు గ్రామంలో రెెగ్యులర్గా పాలు పోసే రైతులకు 24 మందికి పాల క్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మమత రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ స్వాతి రూప, ఎస్బిఐ ఇన్సూరెన్స్ జ్ఞానేశ్వర్, ఐకెపి సిసి ప్రవీణ్, గ్రామ సర్పంచి జ్ఞానేశ్వర్, ఉప సర్పంచ్ ప్రశాంత్, సిఆర్పి వినాయక పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- టెట్ పై అవగాహన - January 24, 2021
- హరిదా సేవలు అభినందనీయం - January 24, 2021
- బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్ - January 23, 2021