నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదికల పనులు నూరు శాతం వెంటనే పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో పలు అంశాలపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 106 రైతు వేదికలు రెండు మూడు రోజుల్లో పూర్తి కావాలని ఎక్కడ కూడా ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలరింగ్‌తో సహా అన్ని పనులు పూర్తి చేయించి నివేదిక పంపాలని ఆదేశించారు. అదేవిధంగా పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపులు కూడా జరగాలని స్పష్టంగా తెలిపారు. స్మశాన వాటికల పనులు కూడా వెంటనే పూర్తి చేయించుటకు ఇంకా ఎక్కడైనా ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే సమస్యలను అధిగమించి ప్రారంభించుటకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సిడిపి, ఎంపీ లాడ్స్ పనులు గ్రౌండ్ కావడంతోపాటు డిసెంబర్‌లోగా అన్నీ కూడా పూర్తిచేసే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. మాజీ ఎంపీ పనులు డిసెంబర్ 2 లోగా పూర్తి చేయడంతో పాటు చెల్లింపులు కూడా చేయవలసి ఉంటుందని ఈ విషయాన్ని అధికారులు దష్టిలో పెట్టుకోవాలన్నారు. కాన్ఫరెన్సులో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021