అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు

కామారెడ్డి, నవంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జనహిత సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, శిశుసంకేమ శాఖ జిల్లా అధికారులు కుటుంబ సంక్షేమ కమిషనర్‌ సూచనల మేరకు గర్భిణీలకు వైద్యపరీక్షలకు వచ్చు వారికి వైద్యపరీక్షలు, భోజన వసతి కల్పించేందుకు ఏర్పాటు గురించి సమన్వయ సమావేశం నిర్వహించారు.

డా.పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ సూచనల ప్రకారం ఏఎన్‌సిలు ఆరోగ్య ఉపకేంద్రం, పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా, జిల్లా ఆసుపత్రులకు వచ్చినప్పుడు గర్భిణీలకు భోజనం అందించుటకు తగిన ఏర్పాట్లు చేయాలని, సంక్షేమ, వైద్య శాఖల ప్రణాళికను తయారు చేసి డిసెంబర్‌ 1 నుండి కామారెడ్డి జిల్లాలో పథకం అమలుకు క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో కషిచేయాలని కోరారు.

సఖి కేంద్రం కామారెడ్డి వారు తాము అందిస్తున్న బాలికకు, మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల నుండి రక్షణకు తీసుకున్న చర్యల కరపత్రాలు, పోస్టర్‌ విడుదల చేసారు. డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ డిసిహెచ్‌ఎస్‌, అనురాధ డిడబ్ల్యువో అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో డా. శ్రీనివాసు ప్రసాద్‌, డా.శోభారాణి, డా.అనిల్‌ కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్లు, సిడిపివోలు, సూపర్‌ వైసర్స్‌, నాగరాజు డిప్యూటి డిఇఎంవో సంజీవరెడ్డి, చలపతి పాల్గొన్నారు.

Check Also

సంస్కతిని కాపాడేలా పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి ...

Comment on the article