కామారెడ్డి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26వ తేదీ గురువారం కామారెడ్డి 132 కె.వి సబ్ స్టేషన్లో మరమ్మత్తుల నిమిత్తం ఉదయము 7 గంటల నుండి 8:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కామారెడ్డి డివిజనల్ ఇంజనీర్ గణేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కావున దీని పరిధిలో గల కామారెడ్డి పట్టణము, కామారెడ్డి రూరల్, తాడ్వాయి మండలం, రాజంపేట మండలం, సదా శివనగర్ మండలంలోని పోసాని పేట్, మార్కల్, సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుంది కావున వినియోగదారులు సహకరించాలన్నారు. వడ్లూరు, షాప్ ది పూర్, క్యాసంపల్లి సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021