నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన గల్ఫ్ దేశాల నుండి స్వదేశానికి వాపస్ వచ్చిన వలస కార్మికుల కొరకు మంగళవారం నిజామాబాద్లో అవగాహన, చైతన్య కార్యక్రమం రెడ్ క్రాస్ హల్లో నిర్వహించారు. కంపెనీ యాజమాన్యాల నుండి కార్మికులకు రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందడం ఎలా అనే విషయాల గురించి చర్చించి పరిష్కార మార్గాలు సూచించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ ఎంబసీల ద్వారా అంతర్జాతీయ కార్మిక సంఘం సహకారంతో ఆయాదేశాలలోని కార్మిక న్యాయస్థానాల్లో కేసులు వేసి తెలంగాణా గల్ఫ్ కార్మికులకు న్యాయ సహాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్య్రమానికి గల్ఫ్ దేశాల నుండి ఇటీవల తిరిగివచ్చిన పలు గ్రామాల కార్మికులు, యూనియన్ నాయకులు కిరణ్ దీకొండ, రోహిత్ దర్మసేన, వల్గొట్ భోజెందర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- టెట్ పై అవగాహన - January 24, 2021
- హరిదా సేవలు అభినందనీయం - January 24, 2021
- బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్ - January 23, 2021