అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈశ్వర్‌ దాస్‌ వైద్యశాలలో పట్టణానికి చెందిన భవాని (25) సంవత్సరాల మహిళ రక్తహీనతతో బాధపడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ క్యాతం సతీష్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తాన్ని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో అందజేసి ప్రాణాలు కాపాడారు.

రక్తదాతను అభినందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని ప్రస్తుత తరుణంలో రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, మానవతా దక్పథంతో రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ...

Comment on the article