కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెడ్‌ప్లస్ ఫార్మసీ సంస్థలో పనిచేయడానికి నిజామాబాద్, హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలున్నాయని కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఇజిఎంఎం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు మెడ్‌ప్లస్ ఫార్మసి సంస్థలో నిజామాబాద్ మరియు హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలున్నాయని, ఉద్యోగాల కొరకు సాందీపని డిగ్రీ కళాశాల కామారెడ్డిలో ఈనెల 28న శనివారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫార్మాసిస్టు, ఫార్మసి అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, వేర్‌హౌస్ అసిస్టెంట్స్ ఉద్యోగాలున్నాయని, అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాలలోపు వారై ఉండాలన్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 8919087069 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021