Breaking News

శ్వాస సంబంధిత వ్యాధి గ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కాలానుగుణంగా వ్యాపించే వ్యాధుల నివారణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలను మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. ప్రస్తుతం కోవిడ్‌ 19 వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు నివారణ, నియంత్రణ గురించి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విస్తతంగా ప్రచారం చేశారు.

కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని వివరించారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ ఒకరు తన వంతు బాధ్యత వహించాలని తన కుటుంబ సభ్యులందరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, జనం గుంపులుగా చేరకూడదని, తరుచుగా చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు.

చలికాలంలో పిల్లలను, వద్దులు, శ్వాస సంబంధించిన వ్యాధి గ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులు సోకవని తెలిపారు. ప్రచారంలో వి.సంజీవరెడ్డి, ఎం రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు, కె విఠల్‌రావు, కామారెడ్డిలో అశోక్‌ నగర్‌, ఎన్‌జివోస్‌ కాలనీ, విద్యానగర్‌, కల్కినగర్‌, బస్టాండ్లలో, మున్సిపల్‌ రోడ్‌, నిజాంసాగర్‌ రోడ్‌, స్టేషన్‌ రోడ్‌, సిరిసిల్లరోడ్డు, మార్కెట్‌, పెద్దమ్మ గల్లీ, వివేకానంద కాలనీ, గోదాంరోడ్డు, పంచముఖి హన్మాన్‌ గల్లీ, సైలోనై కాలనీ, భుపుత్ర కాలనీ, రమరెడ్డి రోడ్‌, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ప్రచారం నిర్వహించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article