Breaking News

Daily Archives: November 26, 2020

డిసెంబర్‌ 15 లోగా పూర్తిచేయండి

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కజొన్న కొనుగోళ్లను డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జనహిత భవన్‌లో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో మొక్కజొన్న కొనుగోలుకు చేపట్టే చర్యలను ఆయన సమీక్షించారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా చేపట్టే కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా, బయట కొని కేంద్రాలలో అమ్మినా, లెక్కలలో తారుమారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ కొనుగోలు ...

Read More »

సమస్యలుంటే చెప్పండి

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి ధాన్యం గోదామును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌ పరిశీలించారు. అనంతరం ఎస్‌.ఎస్‌.నగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేందాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అని అడిగారు. కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. అనంతరం బికనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో రైస్‌ మిల్లును సందర్శించి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ విధానాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టరు డాక్టర్‌ ...

Read More »

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఎల్లారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము, దళిత సైన్యం, వివిధ గ్రామాల సర్పంచులు, తదితర నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటి దినం 26.నవంబర్‌ 1949 సంవత్సరంలో భారత రత్న డా.బి.ఆర్‌. అంబెడ్కర్‌ భారత రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించడం, పరిషత్‌ ఆమోదించడం జరిగిందన్నారు. ...

Read More »

కామారెడ్డిలో సార్వత్రిక సమ్మె

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం ముందు బహిరంగ సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత రాజనర్సు వహించగా వేదికమీద ఏఐటియుసి జిల్లా బాధ్యలు ఎల్‌. దశరథ్‌. ఏఐటియుసి జిల్లాఅధ్యక్షుడు రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, ఏఐటియుసి జిల్లా కోశాధికారి. పి. బాలరాజు. ఏఐటియుసి సీనియర్‌ నాయకుడు నరసింహ రెడ్డి, సిఐటియు జిల్లా కన్వీనర్‌ ఎల్లన్న, సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్‌, మహబూబ్‌, సంతోష్‌ ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు మాలహరి, ఐఎఫ్‌టియు రాజు, ...

Read More »

అర్థ శాస్త్ర విభాగంలో పిహెచ్‌డి

డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో ఏ.పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి సౌందర్య ప్రపంచీకరణ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు అనే సిద్ధాంత గ్రంధానికి ఆన్‌లైన్‌లో నిర్వహించిన పిహెచ్‌డి వైవ -ఓస్‌కు బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.రామాంజనేయులు ఎక్స్‌టర్‌నల్‌ ఎక్సమినర్‌గా, సోషల్‌ సైన్స్‌ డీన్‌ ప్రొ.కే.శివశంకర్‌ ముఖ్య అతిధిగా హాజరై అభినందించారు. సౌందర్య తన విస్తత పరిశోధనలో ప్రపంచీకరణలో భాగంగా వ్యవసాయరంగంలో భారీగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు రైతులను ...

Read More »

‘మనము మన రాజ్యాంగం’ పుస్తకావిష్కరణ

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సామాజిక సమరసత వేదిక అద్వర్యంలో కామారెడ్డి మున్సిపల్‌ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ సూతరి రవి ‘మనము మన రాజ్యాంగం’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సమైక్యత, దేశ అఖండతతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రవచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలని ప్రజల్లో అవగాహన నింపడానికి రాజ్యాంగ విధివిధానాలు ...

Read More »

మన రాజ్యాంగం మనకెంతో గర్వకారణం

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ప్రగతి భవన్‌లో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం భారత దేశానికి రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా తయారుచేయడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చర్చించి, శోధించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలను, వారి జీవన పరిస్థితులను దష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు దిక్సూచిగా ...

Read More »

యాంత్రీకరణపై రైతులకు అవగాహన

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాగులో యంత్రాల ఉపయోగం, ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెంచుకోవడంపై రైతులకు జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్‌లో వ్యవసాయ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ముఖ్యమైన వ్యవసాయ పనులు నిర్వహించుకునే సమయంలో రైతులకు నాటు వేయడం, కలుపు తీయడం, పంటలు కోయడం తదితర ...

Read More »