ఎల్లారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము, దళిత సైన్యం, వివిధ గ్రామాల సర్పంచులు, తదితర నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటి దినం 26.నవంబర్ 1949 సంవత్సరంలో భారత రత్న డా.బి.ఆర్. అంబెడ్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించడం, పరిషత్ ఆమోదించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ సంఘము ఎల్లారెడ్డి డివిజన్ ఇన్చార్జి బిట్ల సురేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్, నియోజకవర్గ ఇంచార్జి చింతల శంకర్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి నాగుల ప్రసాద్, దళిత సైన్యం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబు, సర్పంచులు జంబుక సత్యం, గాదె బాలయ్య, ఎల్లారెడ్డి కో-ఆప్షన్ మెంబర్ బురిగారి లక్ష్మీలింగం, కొలగారి రాజు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- టెట్ పై అవగాహన - January 24, 2021
- హరిదా సేవలు అభినందనీయం - January 24, 2021
- బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్ - January 23, 2021