‘మనము మన రాజ్యాంగం’ పుస్తకావిష్కరణ

కామారెడ్డి, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సామాజిక సమరసత వేదిక అద్వర్యంలో కామారెడ్డి మున్సిపల్‌ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ సూతరి రవి ‘మనము మన రాజ్యాంగం’ పుస్తకం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సమైక్యత, దేశ అఖండతతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రవచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలని ప్రజల్లో అవగాహన నింపడానికి రాజ్యాంగ విధివిధానాలు తెలుసుకోవడం ఈ రోజుల్లో ఎంతైనా అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన విధంగా శ్యామ్‌ ప్రసాద్‌ తెలుగులోకి అనువదించారని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తుచేశారు. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ...

Comment on the article