Breaking News

రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి, ఎంపీ లాడ్స్‌ పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీ లాడ్స్‌ నిధులతో చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో ఎంపి లాడ్స్‌, రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పంచాయతీ రాజ్‌, శాఖ ఈఈ, డిఈ, ఏఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పనుల అభివద్ధి గురించి మండలాల వారీగా సమీక్షించారు.

రైతు వేదికలు శనివారం వరకు పనులు పూర్తి చేస్తూ బిల్స్‌ కూడా పేమెంట్‌ కావాలని, అదేవిధంగా ప్రతి మండలంలో పనులు పూర్తి కావాలని, రైతు వేదిక పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని మండలంలో పూర్తి కాని చోట వెంటనే పూర్తి కావాలని ఆదేశించారు. ఎక్కడైనా రైతు వేదికలు పెండింగ్‌ ఉంటే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపి లాడ్స్‌ పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని లేకుంటే బిల్లులు పేమెంట్‌ జరగవని హెచ్చరించారు.

కావున తొందరగా పూర్తి చేసి బిల్స్‌ పేమెంట్‌ చేయాలన్నారు. సిడిపి పనులు డిసెంబర్‌ 31 వరకు పూర్తి చేసి వారికి పేమెంట్‌ చేయాలని, పనులు, పేమెంట్‌ పెండింగ్‌ వుండకూడదని ఆదేశించారు. ఎక్కడైనా ప్రాబ్లెమ్‌ ఉంటే తమ దష్టికి తేవాలని అధికారులకు ఆదేశించారు. రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పనులు పూర్తి చేసిన చోట ఎఫ్‌టిఓచే జనరేట్‌ చేయాలని చాలా మండలాలలో పనులు పూర్తి చేసినప్పటికీ బిల్స్‌ పేమెంట్‌ జరుగలేదని వెంటనే అన్ని పనులు పూర్తి కావాలన్నారు.

నామినేషన్‌ స్థాయిలో ఉన్నవాటికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, మంజూరైన పనులు ప్రారంభం కాకుంటే వారంలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కావున ప్రతి ఒక్కరు గట్టిగా కష్టపడి పని చేయాలని, అదేవిధంగా ప్రతి పనీ మొదలు కావాల్సిందేనని అధికారులను ఆదేశించారు.

బోధన్‌తో పాటు కొన్ని మండలంలోని అన్ని పనులు బాగా జరుగుతున్నవని ఏఈలను కలెక్టర్‌ అభినందించారు. ఇసుక ఎవ్వరికీ ఎంత అవసరమో అంతకు డిడి లు కట్టి ఇసుక తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఈఈ భవన్న, మురళి, డిఈలు రాజయ్య, శంకర్‌, ఏఈలు, సిపిఓ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article