Breaking News

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఇతర ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్‌, ఫైర్‌, వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లతో పాటు కోవిడ్‌ నిబంధనలను విధులు నిర్వహించే సిబ్బందితోపాటు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా విద్యుత్‌ సరఫరా ఆటంకం లేకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులు అందరూ నిర్ణీత సమయానికి ఆయా శాఖలకు సంబంధించిన నోట్స్‌తో హాజరుకావాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, లత, జిల్లా ఫైర్‌ అధికారి, డిఎంఅండ్‌ హెచ్‌వో సుదర్శనం, ఇతర అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article