Breaking News

ఎమ్మెల్యేను పరామర్శించిన సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బిగాలా గణేష్‌ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

శాసనసభ్యులు గణేష్‌ గుప్తా తండ్రి కష్ణమూర్తి గుప్తా గత కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా చనిపోయిన విషయం విదితమే. ఆయన ద్వాదశ దిన కర్మను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం మాక్లూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి గుప్త సోదరులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కీర్తిశేషులు కష్ణమూర్తి గుప్తా చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చినారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖా మాత్యులు మహమూద్‌ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, రోడ్లు -భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, రాజ్యసభ సభ్యులు కె.ఆర్‌. సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు వి. జి. గౌడ్‌, ఆకుల లలిత, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌ రెడ్డి, హనుమంత్‌ షిండే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్రావు, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, ఐడిసిఎంఎస్‌ మోహన్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ముఖ్యమంత్రిని రిసీవ్‌ చేసుకున్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article