Breaking News

Daily Archives: December 3, 2020

డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ఆర్‌టిసి జగిత్యాల డిపోలో ఆసక్తిగల అభ్యర్థులకు హెవీ వైకిల్‌ డ్రైవింగ్‌లో శిక్షణను సోమవారం నుండి అనగా ఈనెల ఏడవ తేదీ నుండి జగిత్యాల డిపోలో ప్రారంభిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్‌ జగదీశ్వర్‌ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు శిక్షణ రుసుము రూ. 15 వేల 500 సోమవారం లోగా చెల్లించి తమ పేరు నమోదు చేసుకొని హెవీ డ్రైవింగ్‌లో శిక్షణ పొంది తమ భవిష్యత్తుకు బాట వేసుకోవాల్సిందిగా సూచించారు.

Read More »

కృత్రిమ అవయవాల ద్వారా వైకల్యాన్ని అధిగమించవచ్చు…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ సౌజన్యంతో న్యాయ సేవా అధికార సంస్థ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించారు. ఉచిత కత్రిమ అవయవాల ఏర్పాటు శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా స్పెషల్‌ జడ్జ్‌ జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చైర్మన్‌ సాయి రమాదేవి పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల ...

Read More »

దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పి.చంద్రశేఖర్‌ వసేక్టమీ పక్షోత్సవం అవగాహన కార్యక్రమములో తన సందేశాన్ని తెలిపారు. కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం ఉండాలని, ఇద్దరు పిల్లలు గల దంపతులు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిచాలని, మగవారు వసేక్టమీ చేయించుకోవాలన్నారు. ఈ విధానం సులభమైనదని,.దీని వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.. దాంపత్య జీవితంలో కుటంబ నియంత్రణ పురుషులకు ప్రోత్సాహించాలని, కొత్త, కుట్టు, లేని చాలా సులభమైన విధానం కేవలం ఐదు ...

Read More »

త్యాగం శ్రీకాంతాచారిది… భోగాలు కేసీఆర్‌ కుటుంబానివి…

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని శ్రీకాంతాచారి చేస్తే నేడు స్వరాష్ట్రంలో భోగాలు మాత్రం కెసిఆర్‌ కుటుంబానికి దక్కాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలోని వారికి లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అందరికీ అవకాశాలు లభిస్తాయని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి విద్యార్థుల చావులకు కారణమైన కెసిఆర్‌ మరి రాష్ట్రం వచ్చినా ఎందుకు ఉద్యోగ ...

Read More »

విద్యార్థి అమరవీరుడికి ఘన నివాళి

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : (తెలంగాణ విద్యార్థి పరిషత్‌) టీజీవిపి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అమరుడైన శ్రీకాంత చారి 11 వ వర్ధంతి సందర్భంగా స్థానిక హౌసింగ్‌ బోర్డ్‌ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒంటిపై పెట్రోలు పోసుకుని శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేస్తే నేడు స్వరాష్ట్రంలో భోగాలు మాత్రం కెసిఆర్‌ కుటుంబానికి దక్కాయని టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌ ఆరోపించారు. ...

Read More »

వ్యవసాయ రుణాల గురించి అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు వ్యవసాయ పంట రుణాలు డిసెంబర్‌ 15 తేదీ వరకు రెన్యువల్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకర్స్‌ మండల స్థాయి అధికారులతో రుణాల రెన్యువల్‌ పై మాట్లాడారు. డిసెంబర్‌ 15 తేదీ వరకు అన్ని వ్యవసాయ రుణాలను రెన్యువల్‌ చేయించుకొనుటకు రైతులకు అగ్రికల్చర్‌ అధికారులు బ్యాంకర్స్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, గ్రామ పంచాయతీ స్థాయి నుండి అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ రుణాలు రెన్యువల్‌ చేయడంవల్ల రైతుకు ...

Read More »

ఐఎఫ్‌టియు ధర్నా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తెన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి ఐ.ఎఫ్‌.టి.యు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కార్పొరేట్‌ ప్రతినిధిగా మోడీ ...

Read More »

శుక్రవారం వాహనాల వేలంపై అవగాహన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రిపేర్లో ఉన్న ప్రభుత్వ వాహనాల వేలం పై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శుక్రవారం అనగా 4 తేదీ ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో వైకిల్‌ యాక్షన్‌పై ఆసక్తి కలిగిన వారికి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు పాల్గొనాలని, యాక్షన్‌లో పాల్గొనేవారు నియమ నిబంధనలు, డిపాజిట్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన సదస్సులో ...

Read More »

ఎదగాలంటే మనసు పెట్టి పనిచేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వం సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా అందిస్తున్న రివాల్వింగ్‌ ఫండ్‌ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉద్భోదించారు. గురువారం ప్రగతిభవన్‌లో మత్స్యశాఖ ఏర్పాటుచేసిన రివాల్వింగ్‌ ఫండ్‌ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని రివాల్వింగ్‌ ఫండ్‌ 50 లక్షల రూపాయల చెక్కులను 16 సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ మత్స్య పారిశ్రామిక సంఘాలకు అందిస్తున్న ...

Read More »

కార్యాలయం ముట్టడించిన కార్మికులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికై కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పర్మినెంట్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అర్హులైన పర్మినెంట్‌ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని యూనియన్‌ డిమాండ్‌ చేస్తుంటే అనర్హులకు, అనుభవం లేనటువంటి వ్యక్తులకు ప్రమోషన్‌ సౌకర్యం కల్పిస్తున్నారని, కార్మికుల సంఖ్య పెంచకుండా పనిచేస్తున్న కార్మికుల మీద పనిభారం ...

Read More »

రామారెడ్డిలో కరోన పరీక్షలు – అందరికి నెగిటివ్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్‌ సెంటర్‌లో కరోన పరీక్షలు నిర్వహించినారు. రామరెడ్డి గ్రామంలో 89 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 58 మందికి, పోసానిపేట్‌ గ్రామంలో 42 మందికి, ఉప్పల్‌ వాయ్‌ గ్రామంలో 41 మందికి, మరియు వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో 66 మందికి కరోన పరీక్షలు నిర్వహించారని వైద్యాధికారి షాహీద్‌ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 319 మందికి కరోన ...

Read More »

గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంపు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ ...

Read More »