Breaking News

Daily Archives: December 4, 2020

ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కామరెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్‌ సెంటర్‌లో కరోన పరీక్షల క్యాంప్‌ నిర్వహించినారు. క్యాంపులల్లో రామరెడ్డి గ్రామంలో 40 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 40 మందికి, పోసానిపేట్‌ గ్రామంలో 40 మందికి, ఉప్పల్‌ వాయ్‌ గ్రామంలో 40 మందికి, మరియు వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో 40 కరోన పరీక్షలు నిర్వహించారని డాక్టర్‌ షాహీద్‌ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 16 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 216 మందికి ...

Read More »

ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

బోధన్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై ఎల్‌పిజి గ్యాస్‌ ...

Read More »

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు తెలిపారు. హైదరాబాద్‌లో ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్‌ చాంబర్‌లో ఫలితాలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, అడిషనల్‌ పరీక్షల నియత్రణాధికారి (ఇడిపి) డా.అథిక్‌ సుల్తాన్‌ ఘోరి, ఎఆర్‌ సాయాగౌడ్‌ పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ పరీక్షల్లో బిఎ ...

Read More »

12న జాతీయ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12న రెండవ శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా మరియు ప్రిన్సిపల్‌ జడ్జి సాయి రమాదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవ సర్వీసెస్‌ భవనంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీం కోర్ట్‌, హైకోర్టు ఆదేశాలను అనుసరించి జాతీయ లోక్‌ అదాలత్‌ ఈ నెల 12న రెండవ శనివారం నిర్వహిస్తున్నామని, గుర్తించిన కేసులకు సంబంధించిన కక్షిదారులు హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. కరోనా వైరస్‌ ...

Read More »

ఇరిగేషన్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరిగేషన్‌ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌ భూముల అన్యాక్రాంతంపై ఇరిగేషన్‌, రెవిన్యూ, పోలీస్‌ శాఖల అధికారులతో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి, లేదా ఇతర ఏ ప్రాజెక్టులు కానీ, ప్రభుత్వ భూములు కానీ చిన్న గుంట అయినా సరే ఎట్టి పరిస్థితిలో ఆక్రమించడానికి వీల్లేదన్నారు. ఎక్కడైనా, ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే తొలగించాలని ...

Read More »

గరిశకుర్తి రచనల ద్వారా నిలిచి ఉంటాడు…

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాను చేసిన సాహిత్య సృజన ద్వారా కవిగా, రచయితగా గరిశకుర్తి రాజేంద్ర ప్రజల మనస్సుల్లో కలకాలం నిలిచి ఉంటాడని, అన్ని స్థాయిల్లోని జనులకు అర్థమయ్యే రీతిలో రాసిన ప్రతిభ గరిశకుర్తికి సొంతమని తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం తెరవే ఆధ్వర్యంలో కామారెడ్డి కర్షక్‌ బి.ఇడి. కళాశాలలో గరిశకుర్తి రాజేంద్ర సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు మాట్లాడారు. ...

Read More »

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళిక 2018-19 క్రింద సబ్సిడీ రుణాల కొరకు ధరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇ.రాజేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు, మండల పరిషత్‌ అభివద్ధి అధికారులు మరియు మున్సిపల్‌ కమీషనర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా క్లియర్‌ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను ఈ నెల 10 వరకు బ్యాంక్‌ సమ్మతితో ఎస్‌సి కార్పొరేషన్‌ నిజామాబాద్‌ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు.

Read More »

వినికిడి సమస్యలున్న వారు హైదరాబాద్‌ వెళ్ళాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల వైకల్య పర్సంటేజ్‌ ధవీకరించడానికి ఏర్పాటు చేసే సదరం క్యాంపులకు దివ్యాంగులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని, వారిని మాత్రమే క్యాంపులకు అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 3 డివిజన్‌ కేంద్రాలలో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాదులో ఈనెల 7న, బోధన్‌ లో ...

Read More »

మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద మరుగుదొడ్లు ప్రారంభం

బాన్సువాడ, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద పట్టణ ప్రజల అవసరాలకోసం నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కల్కి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌కు వచ్చే ప్రజలు, పర్యాటకుల అహ్లాదం కోసం రూ. 20 లక్షల ఖర్చు చేసి తెప్పించిన 24 సీట్ల సామర్ధ్యం కలిగిన అధునాతన బోట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు ...

Read More »

వీధి వ్యాపారుల రుణాలు మంజూరు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి వ్యాపారుల రుణాలు 10 వ తేదీలోగా వంద శాతం శాంక్షన్‌ చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. శుకవారం తన ఛాంబర్‌లో జరిగిన వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల రుణాలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లబ్దిదారులకు అందించే రుణాల లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని, బ్యాంక్‌ అధికారుల సమన్వయంతో 15 వ తేదీలోగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ ...

Read More »