Breaking News

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు తెలిపారు. హైదరాబాద్‌లో ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్‌ చాంబర్‌లో ఫలితాలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, అడిషనల్‌ పరీక్షల నియత్రణాధికారి (ఇడిపి) డా.అథిక్‌ సుల్తాన్‌ ఘోరి, ఎఆర్‌ సాయాగౌడ్‌ పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ పరీక్షల్లో బిఎ లో బాలికలు 54 శాతం, బాలురు 41 శాతం, మొత్తం 48 శాతం, బికాంలో బాలికలు 53 శాతం, బాలురు 31 శాతం, మొత్తం 43 శాతం, బిఎస్సీలో బాలికలు 59 శాతం, బాలురు 46 శాతం, మొత్తం 57 శాతం, బిఎస్సీ లో బాలికలు 53 శాతం, బాలురు 29 శాతం, మొత్తం 45 శాతం, బిబిఎలో బాలికలు 77 శాతం, బాలురు 46 శాతం, మొత్తం 61 శాతం మొత్తం డిగ్రీ ఆరవ సెమిస్టర్‌లో బాలికలు 55 శాతం, బాలురు 34 శాతం, మొత్తం 48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. డిగ్రీ ఫలితాలలో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ముగిసిన 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసి రికార్డు సాధించడం పట్ల వీసీ, రిజిస్ట్రార్‌లు కంట్రోలర్‌ను, పరీక్షల మూల్యాంకన యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

అంతేగాక అన్ని విశ్వవిద్యలయాల కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయడం కూడా విశేషంగా భావించవచ్చు. డిగ్రీ విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలిపిన వీసీ, రిజిస్ట్రార్‌లు. వీసీ, రిజిస్ట్రార్‌ల ప్రత్యేక చొరవతో ఫలితాల ప్రాసెస్‌ అంతా కూడా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇడిపి సెక్షన్‌లోనే నిర్వహించడం ఫలితాల్లో ప్రాముఖ్యత వహించిందని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు పేర్కొన్నారు.

ఆరవ సెమిస్టర్‌కు సంబంధించిన కన్సోలిడేటెడ్‌ మెమోస్‌ ఈ నెల 5 వ తేదీన తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ నుండి పొందవచ్చని కంట్రోలర్‌ వివరించారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article