Breaking News

ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

బోధన్‌, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రూ. 50 లు ఒకేసారి పెంచి సామాన్యులపై పెద్ద ఎత్తున ఆర్థిక భారాన్ని మోపిందని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి రాకముందు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే నిత్యావసర ధరలను పెంచబొమని చెప్పారని, కాని తీర అధికారంలోకి వచ్చాక నిత్యం అన్నింటి ధరలను పెంచుతూ పోతుందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన ఎల్‌పిజి ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్‌, పడాల శంకర్‌లు, జి.సీతారాం, పో శెట్టి, మక్కయ్య, మైబూబ్‌, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article