Breaking News

ఇరిగేషన్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరిగేషన్‌ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌ భూముల అన్యాక్రాంతంపై ఇరిగేషన్‌, రెవిన్యూ, పోలీస్‌ శాఖల అధికారులతో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి, లేదా ఇతర ఏ ప్రాజెక్టులు కానీ, ప్రభుత్వ భూములు కానీ చిన్న గుంట అయినా సరే ఎట్టి పరిస్థితిలో ఆక్రమించడానికి వీల్లేదన్నారు.

ఎక్కడైనా, ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే తొలగించాలని రెవిన్యూ, పోలీస్‌, సర్వే, ఇరిగేషన్‌ శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో పాటు నిజాంసాగర్‌కు సంబంధించినటువంటి నాగారం అర్సపల్లి దగ్గర ఉన్నటువంటి కెనాల్స్‌ కూడా ఎంక్రోచుమెంట్‌ జరిగి ఉంటే చట్టప్రకారం లేనివి తొలగించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేసి వాటిని తొలగించాలని తెలిపారు. లక్ష్మి కెనాల్‌, కాకతీయ కెనాల్‌, ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఇరిగేషన్‌ భూములు కాపాడుకునే బాధ్యత ఇరిగేషన్‌ శాఖదే అని, అన్ని రకాల చర్యలు తీసుకొని కాపాడాలని ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారి మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాగారం నుండి నిజాం సాగర్‌ కెనాల్‌ వెళుతుంది. కెనాల్‌తో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వాటర్‌ తీసుకురావడానికి మంచిప్ప రిజర్వాయర్‌ నుంచి వాటర్‌ వెళ్లడానికి నిజాంసాగర్‌ కెనాల్‌ దాని కెపాసిటీని పెంచుకోవాలని కెపాసిటీ పెంచుకున్నప్పుడే గ్రామీణ నియోజకవర్గ మండలాలలో నీటి కెపాసిటీ పెరుగుతుందన్నారు. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. మండల, డివిజన్‌ స్థాయి టీములు ఏర్పర్చుకోవాలన్నారు.

సోమవారం వరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని బృందాలు తయారు చేసుకోవాలన్నారు. రూల్‌ ప్రకారంగా వెళ్ళాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌పి ఏసిఇ శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఇరిగేషన్‌, రెవిన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article